ఆదివారం 01 నవంబర్ 2020
Sports - Sep 29, 2020 , 02:28:40

సన్‌రైజర్స్‌ పుంజుకునేనా..!

సన్‌రైజర్స్‌ పుంజుకునేనా..!

అబుదాబి: ఐపీఎల్‌ 13వ సీజన్‌ను పేలవంగా మొదలుపెట్టిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) బోణీ కోసం తహతహలాడుతున్నది. ఆడిన రెండు (బెంగళూరు, కోల్‌కతా)మ్యాచ్‌ల్లో ఓటమి ఎదుర్కొన్న వార్నర్‌సేన మంగళవారం యువకులతో కళకళలాడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో సమరానికి సిద్ధమైంది. అబుదాబి వేదికగా జరిగే పోరులో ఎలాగైనా ఢిల్లీని ఓడించి పాయింట్ల ఖాతా తెరువాలన్న పట్టుదలతో హైదరాబాద్‌ కనిపిస్తున్నది. ఓపెనర్లు బెయిర్‌స్టో, వార్నర్‌ రాణించడం సహా మిడిలార్డర్‌లో స్లో బ్యాటింగ్‌ను వీడితేనే జట్టు గెలిచే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌పై సూపర్‌ ఓవర్‌లో గెలిచి ఆ తర్వాత ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై నెగ్గిన శ్రేయస్‌ సేన మంచి దూకుడు మీద ఉంది. బౌలర్లు రబాడ, నోర్జే, అమిత్‌ మిశ్రా, అక్షర్‌ ఫామ్‌లోకి రావడం ఢిల్లీకి కలిసొచ్చే అంశం. ఇక ధవన్‌, పృథ్వీ షా, శ్రేయస్‌, పంత్‌తో బ్యాటింగ్‌ బలంగా ఉంది.