ఆదివారం 29 నవంబర్ 2020
Sports - Nov 04, 2020 , 15:00:11

ఆ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌ వార్నరే

ఆ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌ వార్నరే

దుబాయ్:‌ ఐపీఎల్‌ చరిత్రలో  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ అరుదైన ఘనత సాధించాడు. వరుసగా ఆరు ఐపీఎల్‌ సీజన్లలో 500+ స్కోర్లు సాధించిన మొదటి ప్లేయర్‌గా వార్నర్‌ రికార్డు సృష్టించాడు.ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో అర్ధశతకంతో రాణించిన వార్నర్‌(85)..బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లీ(5సార్లు)ని అధిగమించాడు. ఐపీఎల్‌లో అత్యధికసార్లు 500+ పరుగులు సాధించిన ఆటగాడిగా వార్నర్‌ నిలవడం విశేషం. 

2014 నుంచి కనీసం 500కు పైగా పరుగులు సాధిస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.  బాల్‌ టాంపరింగ్‌ వివాదం కారణంగా 2018లో వార్నర్‌ ఐపీఎల్‌ ఆడని విషయం తెలిసిందే.   2020 సీజన్‌లో ఇప్పటి వరకు 14 మ్యాచ్‌లు ఆడిన వార్నర్‌ 529 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆరెంజ్‌ క్యాప్‌ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. 

వార్నర్‌ పరుగుల రికార్డు

2019 ఐపీఎల్‌లో  692 పరుగులు  

2018 ఐపీఎల్‌ ఆడలేదు

2017 సీజన్‌లో  641 పరుగులు

2016 సీజన్‌లో 848 పరుగులు

2015 సీజన్‌లో 562 పరుగులు

2014 సీజన్‌లో 528  పరుగులు