శనివారం 05 డిసెంబర్ 2020
Sports - Oct 08, 2020 , 17:05:55

వార్నర్‌ vs రాహుల్‌.. ఎవరిదో ‘గెలుపు’?

వార్నర్‌  vs  రాహుల్‌.. ఎవరిదో ‘గెలుపు’?

దుబాయ్‌:  గత మ్యాచ్‌లో   ముంబై ఇండియన్స్‌‌ చేతిలో  ఓటమిపాలైన   సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌ మరో  ఆసక్తికర పోరుకు సిద్ధమైంది.  డేవిడ్‌ వార్నర్‌ సారథ్యంలోని హైదరాబాద్‌ దుబాయ్‌ వేదికగా ఇవాళ  కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌తో  తలపడనుంది.  పంజాబ్‌తో  జరిగే మ్యాచ్‌లో సత్తాచాటి గాడిలో పడాలని వార్నర్‌  సేన పట్టుదలగా ఉంది.  వరుస ఓటములతో లీగ్‌ను మొదలుపెట్టిన సన్‌రైజర్స్‌  విజయాల బాట పట్టిందనుకున్న తరుణంలోనే  గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ చేతిలో అనూహ్యంగా కంగుతిన్నది. 

సీనియర్‌  పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ దూరం కావడం హైదరాబాద్‌కు ఎదురుదెబ్బే.  బ్యాటింగ్‌‌ విషయంలో సన్‌‌రైజర్స్‌‌ పటిష్ఠంగానే ఉంది.   విజయం సాధించాలంటే ఆరంభ,  డెత్‌  ఓవర్లలో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పాటు బ్యాట్స్‌మెన్‌ సమిష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది.   మరోవైపు  ఐదు మ్యాచ్‌ల్లో ఒకటే గెలిచిన పంజాబ్‌  ఎలాగైనా గెలువాలని పట్టుదలగా ఉంది.  మ్యాచ్‌లో మార్పులుండే అవకాశం కనిపిస్తోంది.   

వరుసగా విఫలమవుతున్న గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌కు బదులుగా హార్డ్‌ హిట్టర్‌ క్రిస్‌ గేల్‌ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది.  సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో  కేఎల్‌ రాహుల్‌ సారథ్యంలోని పంజాబ్‌ ఒత్తిడిని తట్టుకొని నిలబడాల్సి ఉంది.   బౌలింగ్‌‌ వైఫల్యమే  పంజాబ్‌ ప్రధాన సమస్యగా మారింది. 200 పరుగులకు పైగా లక్ష్యాన్ని కూడా  ఆ ‌ బౌలర్లు  కాపాడలేకపోతున్నారు. బౌలర్ల నిలకడలేమి ప్రదర్శనతోనే ఆ జట్టు ఓటమిపాలవుతోంది. యువ స్పిన్నర్‌ ముజీబ్‌ రెహమాన్‌ జట్టులోకి వచ్చే ఛాన్స్‌ ఉన్నది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.