ఆదివారం 29 నవంబర్ 2020
Sports - Oct 11, 2020 , 15:03:18

SRH vs RR: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న వార్నర్‌

SRH vs RR: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న వార్నర్‌

దుబాయ్‌: ఐపీఎల్‌-13లో   సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది.  ఇక హైదరాబాద్ గెలుపే లక్షంగా మ్యాచ్‌కు సిద్ధమైంది.  సీజన్లో నిలకడ లేని ఆటతో ప్లేఆఫ్‌ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకున్న రాజస్థాన్‌ ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్నది.   ఇందులో గెలవడం ద్వారా మళ్లీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని  స్టీవ్‌స్మిత్‌సేన భావిస్తోంది.  టాస్‌ గెలిచిన హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. 

ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌ నాలుగింటిలో ఓడింది.  ఢిల్లీతో మ్యాచ్‌లో అచ్చొచ్చిన  షార్జా మైదానంలోనూ  రాజస్థాన్‌ పరుగులు తీసేందుకు అష్టకష్టాలు పడింది.   కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ను  చిత్తుగా ఓడించి మళ్లీ  గెలుపు బాట పట్టిన  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆత్మవిశ్వాసంతో ఉంది.