శుక్రవారం 27 నవంబర్ 2020
Sports - Sep 26, 2020 , 19:07:12

KKR vs SRH:టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌

KKR vs SRH:టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌

అబుదాబి: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-13లో  మరో  సూపర్‌ పోరు జరగనుంది.  సన్‌రైజర్స్‌  హైదరాబాద్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ టీమ్‌లు  సీజన్‌లో బోణీ చేయాలని భావిస్తున్నాయి.  గత మ్యాచ్‌ లోపాలను  సరిదిద్దుకొని బరిలో దిగుతున్న ఇరు జట్లూ  విజయంపై కన్నేశాయి. టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. 

ఇరు జట్లు తుది జట్టులో భారీగా మార్పులు చేశాయి.  సన్‌రైజర్స్‌ టీమ్‌లో గాయంతో టోర్నీకి దూరమైన  మిచెల్‌ మార్ష్‌ స్థానంలో   మహ్మద్‌ నబీ,  వెన్నునొప్పి కారణంగా విజయ్‌ శంకర్‌ తప్పుకోవడంతో వృద్ధిమాన్‌ సాహా తుది జట్టులోకి వచ్చాడు. మరో పేసర్‌  సందీప్‌ శర్మ స్థానంలో ఖలీల్‌ అహ్మద్‌ను టీమ్‌లోకి తీసుకున్నట్లు వార్నర్‌ తెలిపాడు.  సందీప్‌ వారియర్‌, నిఖిల్‌ నాయక్‌ స్థానంలో కమలేశ్‌ నాగర్‌కోటి, వరుణ్‌ చక్రవర్తిని జట్టులోకి తీసుకున్నట్లు కోల్‌కతా కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ తెలిపాడు.