శుక్రవారం 27 నవంబర్ 2020
Sports - Oct 27, 2020 , 23:03:46

సన్‌రైజర్స్‌ చేతిలో ఢిల్లీ చిత్తు...దెబ్బతీసిన రషీద్‌ ఖాన్‌

సన్‌రైజర్స్‌ చేతిలో ఢిల్లీ చిత్తు...దెబ్బతీసిన రషీద్‌ ఖాన్‌

దుబాయ్:‌ ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మెరిసింది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో  జరిగిన కీలక మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ షోతో సత్తా చాటుకుంది.  కొండంత లక్ష్య ఛేదనలో  యువ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌(3/7), సందీప్‌ శర్మ(2/27)  ధాటికి ఢిల్లీ 131 పరుగులకే  ఆలౌటైంది. దీంతో సన్‌రైజర్స్‌  88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ  ఢిల్లీకి ఓటమిపాలైంది. 

రషీద్‌ ఈ సీజన్‌లోనే అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు (4-0-7-3) నమోదు చేశాడు.  రిషబ్‌ పంత్‌(36: 35 బంతుల్లో 3ఫోర్లు, సిక్సర్‌) టాప్‌ స్కోరర్‌. ఆరంభంలో రహానె(26) ఫర్వాలేదనిపించగా మిగతా బ్యాట్స్‌మెన్‌ దారుణంగా విఫలమయ్యారు. హైదరాబాద్‌ బౌలర్ల  దెబ్బకు బ్యాట్స్‌మెన్‌ వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు.  ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్‌ బెర్తు ఖాయం చేసుకోవాలని భావించిన ఢిల్లీకి నిరాశే ఎదురైంది. 

అంతకుముందు ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌(66: 34 బంతుల్లో 8ఫోర్లు, 2సిక్సర్లు), వృద్ధిమాన్‌  సాహా(87: 45 బంతుల్లో 12ఫోర్లు, 2సిక్సర్లు) తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో అలరించారు. ఓపెనర్లు వీరవిహారం చేయడంతో సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో  2 వికెట్లకు  219 పరుగులు చేసింది.  ఆఖర్లో మనీశ్‌ పాండే(44నాటౌట్:‌ 31 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్‌) మెరుపులు మెరిపించడంతో హైదరాబాద్‌  పటిష్ఠ స్కోరు  సాధించింది.