శనివారం 28 నవంబర్ 2020
Sports - Nov 03, 2020 , 21:29:06

మెరిసిన పొలార్డ్‌.. ముంబై స్కోరు 149

 మెరిసిన పొలార్డ్‌.. ముంబై స్కోరు 149

షార్జా: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ పోరాడే స్కోరు చేసింది. పొలార్డ్‌(41: 25 బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లకు తోడు క్వింటన్‌ డికాక్‌(25), సూర్యకుమార్ యాదవ్‌(36), ఇషాన్‌ కిషన్‌(33)  రాణించడంతో ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్లలో సందీప్‌ శర్మ(3/34), జేసన్‌ హోల్డర్‌(2/25), షాబాజ్‌ నదీం(2/19) దెబ్బకు ముంబై భారీ స్కోరు చేయలేకపోయింది.  కీలక మ్యాచ్‌లో హైదరాబాద్‌ బౌలర్లు తమ పదునైన బంతులతో వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ముంబైని కట్టడి చేశారు.