గురువారం 26 నవంబర్ 2020
Sports - Oct 19, 2020 , 02:32:08

నరైన్‌కు ఊరట

 నరైన్‌కు ఊరట

అబుదాబి: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌కు ఊరట లభించిం ది. అతడి బౌలిం గ్‌ యాక్షన్‌పై ఫిర్యాదును పరిశీలించిన ఐపీఎల్‌ కమిటీ.. బౌలింగ్‌ సక్రమంగానే ఉందని తేల్చింది. అబుదాబి వేదికగా ఈ నెల 10న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో నరైన్‌ బౌలింగ్‌ అనుమానాస్పదంగా ఉందని ఫీల్డ్‌ అంపైర్లు.. ఐపీఎల్‌ కమిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఓవర్‌కు సంబంధించిన వీడియో ఫుటేజీని పరిశీలించిన కమిటీ.. నరైన్‌ నిబంధనలకు లోబడే మోచేతిని వంచుతున్నట్లు నిర్ధారించి క్లీన్‌చిట్‌ ఇచ్చింది. నరైన్‌ బౌలింగ్‌పై ఇప్పటికే రెండు సార్లు (2015, 2018) సందేహాలు వ్యక్తం కాగా.. వాటిని అధిగమించి అతడు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతున్నాడు.