బుధవారం 02 డిసెంబర్ 2020
Sports - Oct 24, 2020 , 16:51:18

KKR vs DC: నరైన్‌, రాణా మెరుపులు

KKR vs DC: నరైన్‌, రాణా మెరుపులు

అబుదాబి:   ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఆరంభంలో తడబడిన  కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య ఓవర్లలో గట్టిగా పుంజుకున్నది. సునీల్‌ నరైన్‌, నితీశ్‌ రాణా అనూహ్యంగా చెలరేగి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.  దినేశ్‌ కార్తీక్‌ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన  నరైన్‌  బౌండరీలు వర్షం కురిపించాడు. ఫోర్లు, సిక్సర్లే లక్ష్యంగా  వీరిద్దరి బ్యాటింగ్‌ సాగుతోంది. 

 ఈ జోడీ  45 బంతుల్లోనే 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. 42/3తో కష్టాల్లో ఉన్న జట్టును వీరిద్దరూ ఆదుకున్నారు.  బౌలర్లపై విరుచుకుపడుతున్న ఈ జోడీ   ఈ క్రమంలోనే అర్ధసెంచరీలు పూర్తి చేసుకుంది. 15 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా 3 వికెట్లకు 142 పరుగులు చేసింది.  ప్రస్తుతం రాణా(56), నరైన్‌(57) క్రీజులో ఉన్నారు.