ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Sports - Aug 05, 2020 , 19:53:02

యూఎస్ ఓపెన్ మెయిన్ డ్రాకు సుమీత్ నాగల్

యూఎస్ ఓపెన్ మెయిన్ డ్రాకు సుమీత్ నాగల్

న్యూయార్క్​: రెండోసారి గ్రాండ్​స్లామ్ టోర్నీలో తలపడేందుకు భారత యువ స్టార్ టెన్నిస్ ప్లేయర్ సుమీత్ నాగల్ సిద్ధమయ్యాడు. న్యూయార్క్ వేదికగా జరుగాల్సిన యూఎస్ ఓపెన్​కు అతడు నేరుగా అర్హత సాధించాడు. ఈ విషయాన్ని టోర్నీ నిర్వాహకులు బుధవారం ప్రకటించారు. ఆగస్టు 31వ తేదీ నుంచి యూఎస్ ఓపెన్ జరుగాల్సి ఉండగా… కరోనా ఆందోళన నేపథ్యంలో టాప్ ప్లేయర్లు టోర్నీ నుంచి తప్పుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా యూఎస్ ఓపెన్ మెయిన్ డ్రాకు అర్హత సాధించడంపై ప్రస్తుతం జర్మనీలో శిక్షణ పొందుతున్న నాగల్ స్పందించాడు.  

“గ్రాండ్​స్లామ్​లో మరోసారి డైరెక్ట్​ ఎంట్రీ లభించడం బాగా అనిపిస్తున్నది. అయితే పరిస్థితులు గతేడాదిలా లేవు. చెక్ రిపబ్లిక్​లో చాలెంజర్స్ తర్వాత అమెరికాకు వెళతా” అని సుమీత్​ నాగల్ అన్నాడు. సుమీత్ గతేడాది యూఎస్ ఓపెన్​ తొలి రౌండ్​లో టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్​తో తలపడ్డాడు. మ్యాచ్ ఓడినా.. తొలి సెట్లో విజయం సాధించడంతో నాగల్​పై ప్రశంసల వర్షం కురిసింది. ఈ ఏడాది అతడిపై అంచనాలు మరింత పెరిగాయి. 


logo