సోమవారం 28 సెప్టెంబర్ 2020
Sports - Sep 02, 2020 , 17:35:48

ఏడేండ్ల తర్వాత భారత ఆటగాడు గెలవడం ఇదే మొదటిసారి

 ఏడేండ్ల తర్వాత  భారత ఆటగాడు గెలవడం ఇదే మొదటిసారి

న్యూయార్క్‌:  భారత టెన్నిస్‌  ఆటగాడు సుమిత్‌ నగాల్‌ యూఎస్‌ ఓపెన్‌లో శుభారంభం చేశాడు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో సుమిత్‌ 6-1, 6-3, 3-6, 6-1తో బ్లాడ్లీ క్లాన్‌(అమెరికా)పై అలవోకగా విజయం సాధించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు.  గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సుమిత్‌ రెండో రౌండ్‌కు చేరడం ఇదే మొదటిసారి.   

2013 (సోమ్‌దేవ్‌) తర్వాత గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ సింగిల్స్‌ మెయిన్‌ డ్రా మ్యాచ్‌లో భారత టెన్నిస్‌ ప్లేయర్‌ గెలవడం ఇదే తొలిసారి కావడం విశేషం.  యూఎస్‌ ఓపెన్‌లో ఏడేండ్ల తర్వాత  మెయిన్‌ డ్రా సింగిల్స్‌  మ్యాచ్‌ గెలిచిన తొలి భారత ఆటగాడిగా సుమిత్‌ అరుదైన ఘనత సాధించాడు. 

'ఇది నా మొదటి గ్రాండ్‌స్లామ్‌ విజయం. ఇది కచ్చితంగా నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నేను మరచిపోలేని మ్యాచ్‌ ఇది. శుభాకాంక్షలు తెలిపిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు' అంటూ నగాల్‌ ట్వీట్‌ చేశాడు. 


logo