గురువారం 03 డిసెంబర్ 2020
Sports - Nov 17, 2020 , 02:00:50

బంగ్లాదేశ్‌ యువ క్రికెటర్‌ ఆత్మహత్య

 బంగ్లాదేశ్‌ యువ క్రికెటర్‌ ఆత్మహత్య

ఢాకా: బంగ్లాదేశ్‌ అండర్‌-19 జట్టు మాజీ ఆటగాడు మహమ్మద్‌ సోజిబ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. దుర్గాపూర్‌లోని ఇంట్లో అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడని అక్కడి పోలీసులు తెలిపారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడి కాలేదు.  2018 అండర్‌-19 ప్రపంచకప్‌లో స్టాండ్‌బై ప్లేయర్‌గా ఎంపికైనా సోజిబ్‌కు ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం రాలేదు. 2018 మార్చి నుంచి అతడు ఎలాంటి పోటీ క్రికెట్‌ ఆడలేదు.