శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Sports - Jan 19, 2021 , 12:21:19

50 ఏళ్ల గ‌వాస్క‌ర్ రికార్డును బ‌ద్ధ‌లు కొట్టిన శుభ్‌మ‌న్ గిల్‌

50 ఏళ్ల గ‌వాస్క‌ర్ రికార్డును బ‌ద్ధ‌లు కొట్టిన శుభ్‌మ‌న్ గిల్‌

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై టీమిండియా యువ ప్లేయ‌ర్ల రికార్డుల మోత మోగుతూనే ఉంది. తాజాగా ఓపెన‌ర్ శుభ‌మన్ గిల్ మ‌రో అరుదైన రికార్డును త‌న పేరిట రాసుకున్నాడు. బ్రిస్బేన్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో కేవ‌లం 9 ప‌రుగుల తేడాలో సెంచరీ మిస్ అయినా.. 50 ఏళ్ల కింద‌టి ఓ రికార్డును గిల్ తిర‌గ‌రాశాడు. ఓ టెస్ట్ మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచ‌రీ చేసిన అత్యంత పిన్న వ‌య‌సు ఇండియ‌న్ ఓపెన‌ర్‌గా గిల్ రికార్డు సృష్టించాడు. గిల్ ప్ర‌స్తుత వ‌య‌సు 21 ఏళ్ల 133 రోజులుగా ఉంది. గ‌తంలో ఈ రికార్డు లెజెండ‌రీ బ్యాట్స్‌మ‌న్ సునీల్ గ‌వాస్క‌ర్ (21 ఏళ్ల 243 రోజులు) పేరిట ఉంది. అత‌డు 1970-71లో వెస్టిండీస్‌పై పోర్ట్ ఆఫ్ స్పెయిన్ టెస్ట్ నాలుగో ఇన్నింగ్స్‌లో 67 ప‌రుగులు చేశాడు. నిజానికి ఈ సిరీస్‌తోనే టెస్ట్ అరంగేట్రం చేసిన గిల్‌.. అద్భుతంగా ఆడుతున్నాడు. మెల్‌బోర్న్‌లో జ‌రిగిన రెండో టెస్ట్‌లో 45, 35 ప‌రుగులు చేసిన గిల్‌.. సిడ్నీలో తొలి హాఫ్ సెంచ‌రీ చేశాడు. 


ఇవి కూడా చ‌ద‌వండి

కారు ప్ర‌మాదం, కొడుకు మృతి, డ్ర‌గ్స్‌కు బానిస‌.. బైడెన్ క‌ష్టాలివి!

ధోనీని మించిన రిష‌బ్ పంత్‌.. కొత్త రికార్డు

చైనా వ్యాక్సిన్‌కు పాకిస్థాన్ గ్రీన్ సిగ్న‌ల్‌

మా వ్యాక్సిన్ వాళ్లు తీసుకోవ‌ద్దు : భార‌త్ బ‌యోటెక్‌

VIDEOS

logo