శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sports - May 30, 2020 , 16:18:14

3 నెలల తర్వాత భారత్‌కు విశ్వనాథన్‌ ఆనంద్‌

3 నెలల తర్వాత భారత్‌కు విశ్వనాథన్‌ ఆనంద్‌

బెంగళూరు: భారత చెస్ దిగ్గజం, మాజీ ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌  విశ్వనాథన్ ఆనంద్ మూడు నెలల తర్వాత భారత గడ్డపై  అడుగుపెట్టారు.  కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో ఆనంద్‌ జర్మనీలోనే చిక్కుకున్నారు. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వందే భారత్‌ మిషన్‌ చేపట్టింది. దీనిలో భాగంగా ఆనంద్‌ శుక్రవారం రాత్రి ఎయిర్‌ ఇండియా విమానంలో ఫ్రాంక్‌ఫర్ట్‌ నుంచి ఢిల్లీ మీదుగా బెంగళూరు చేరుకున్నారు.

ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ విశ్వనాథన్‌ కర్ణాటక ప్రభుత్వ కరోనా నిబంధనల ప్రకారం 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. క్వారంటైన్‌ పూర్తైన తర్వాత ప్రోటోకాల్‌ ప్రకారం ఆనంద్‌ చెన్నైకి వస్తారని అతని భార్య అరుణ్‌ తెలిపారు. జర్మనీలోనే ఉంటూ  ఆనంద్‌ ఆన్‌లైన్ చెస్ టోర్నీ ద్వారా పీఎం కేర్స్ ఫండ్‌కి విరాళాలు కూడా సేకరించారు.