ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Sports - Jul 30, 2020 , 00:20:10

స్టువర్ట్‌ బ్రాడ్‌ @ 3

స్టువర్ట్‌ బ్రాడ్‌ @ 3

దుబాయ్‌: వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో దుమ్మురేపిన ఇంగ్లండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ దూసుకెళ్లాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో 500 వికెట్లు పడగొట్టిన ఏడో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కిన బ్రాడ్‌.. టెస్టు ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి చేరాడు. చివరి టెస్టులో 10 వికెట్లు పడగొట్టిన బ్రాడ్‌ ఏకంగా 7 ర్యాంక్‌లు ఎగబాకడం విశేషం. 2016 తర్వాత అతడికిదే అత్యుత్తమ ర్యాంక్‌. 

స్టువర్ట్‌ నువ్వో దిగ్గజం: యువరాజ్‌

టెస్టు క్రికెట్‌లో అరుదైన ఘనతను అందుకున్న బ్రాడ్‌కు యువరాజ్‌ సింగ్‌ తనదైన శైలిలో అభినందనలు తెలిపాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో బ్రాడ్‌ బౌలింగ్‌లో 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదిన యువీ.. ఇప్పుడతడిని దిగ్గజం అంటూ ప్రశంసించాడు. ‘బ్రాడ్‌ గురించి ఏదైనా మాట్లాడితే.. ఆరు సిక్సర్ల గురించే చర్చ సాగుతుంది. కానీ టెస్టు క్రికెట్‌లో 500 వికెట్లు పడగొట్టడం మామూలు విషయం కాదు. పట్టుదల, నిరంతర కృషే అతడిని ఈ స్థాయికి చేర్చాయి. బ్రాడ్‌ నువ్వో లెజెండ్‌' అని యువీ ట్వీట్‌ చేశాడు.


logo