శనివారం 19 సెప్టెంబర్ 2020
Sports - Jul 29, 2020 , 15:32:30

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో స్టువర్ట్‌బ్రాడ్‌కు మూడోస్థానం

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో స్టువర్ట్‌బ్రాడ్‌కు మూడోస్థానం

దుబాయ్‌: విండీస్‌తో జరిగిన మూడో, ఆఖరి టెస్టులో పది వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఐసీసీ టెస్ట్ బౌలర్‌ ర్యాంకిగ్స్‌లో మూడో స్థానంలో నిలిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో బ్రాడ్ ఆరు, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ మూడో టెస్టును 269 పరుగుల తేడాతో గెలవడంలో బ్రాడ్‌ కీలకపాత్ర పోషించాడు. దీంతో ఇంగ్లండ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో గెలిచి విస్డెన్ ట్రోఫీని తిరిగి కైవసం చేసుకుంది.

మూడో టెస్ట్ ప్రారంభానికి ముందు బ్రాడ్ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో పదో స్థానంలో ఉన్నాడు.  మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఏడుస్థానాలు ఎగబాకి మూడోస్థానంలో నిలిచాడు. అలాగే, బ్రాడ్ టెస్ట్ క్రికెట్లో 500 వికెట్లు నమోదు చేసిన ఏడో బౌలర్‌గా అవతరించాడు.  మొదటి ఇన్నింగ్స్‌లో 45 బంతుల్లో 62 పరుగులు చేసి, ఆల్ రౌండర్స్‌ ర్యాంకింగ్‌లో 11 వ స్థానానికి చేరుకున్నాడు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo