మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Sports - Jul 28, 2020 , 16:55:56

టెస్టుల్లో 500 వికెట్ల వీరులు..ఇంగ్లాండ్‌ నుంచి ఇద్దరు

టెస్టుల్లో 500 వికెట్ల వీరులు..ఇంగ్లాండ్‌ నుంచి ఇద్దరు

మాంచెస్టర్‌:  సుదీర్ఘకాలం అంతర్జాతీయ  టెస్టు క్రికెట్‌లో  అద్భుత ప్రదర్శన చేస్తేనే  500 వికెట్ల మైలురాయిని  అందుకోగలరు. తాజాగా టెస్టు క్రికెట్‌లో 500 వికెట్లు తీసిన ఏడో ఆటగాడిగా  ఇంగ్లాండ్‌  పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌  రికార్డు నెలకొల్పాడు.  టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీ ధరన్ 800 వికెట్లతో అగ్రస్థానంలో  కొనసాగుతున్నాడు.  ఆస్ట్రేలియా స్పిన్నర్ షేన్ వార్న్ 708 వికెట్లతో రెండో స్థానంలో.. టీమిండియా స్పిన్నర్ అనిల్ కుంబ్లే 619 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నారు. 

తొలి మూడు స్థానాల్లో ఉన్న ముగ్గురు  స్పిన్నర్లే కావడం విశేషం.  వీరి తర్వాత  జేమ్స్‌ ఆండర్సన్‌(589),  గ్లెన్‌ మెక్‌గ్రాత్‌(563), కోర్ట్నీ వాల్ష్‌(519), స్టువర్ట్‌ బ్రాడ్‌(500)   తర్వాతి స్థానాల్లో ఉన్నారు.  ప్రస్తుతం ఆండర్సన్‌, బ్రాడ్‌ మాత్రమే అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతున్నారు. ఆండర్సన్‌ తర్వాత ఈ ఫీట్‌ సాధించిన రెండో ఇంగ్లాండ్‌ బౌలర్‌ బ్రాడ్‌ కావడం విశేషం.


logo