ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Sports - Jul 27, 2020 , 19:23:46

టెస్టుల్లో బ్రాడ్ 600వికెట్ల మార్కును దాటుతాడు

టెస్టుల్లో బ్రాడ్ 600వికెట్ల మార్కును దాటుతాడు

మాంచెస్టర్​: తనలో దూకుడు, వేగం ఏ మాత్రం తగ్గలేదని వెస్టిండీస్​తో టెస్టు సిరీస్​లో ఇంగ్లండ్ స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్​ నిరూపించాడని ఆ దేశ మాజీ కెప్టెన్ మైకేల్ ఆథెర్టన్​ అన్నాడు. టెస్టు క్రికెట్​లో 600 వికెట్లను బ్రాడ్ పడగొట్టగలడని స్కై స్పోర్ట్స్​కు ఇచ్చిన ఇంటర్వూలో అన్నాడు. కాగా వెస్టిండీస్​తో ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో ఆరు వికెట్లు తీసిన బ్రాడ్​ రెండో ఇన్నింగ్స్​లో రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో టెస్టుల్లో 499 వికెట్ల దగ్గర నిలిచాడు. మరో వికెట్ పడగొడితే టెస్టుల్లో 500 వికెట్లు సాధించిన రెండో ఇంగ్లండ్ బౌలర్​గా ఘనత సాధిస్తాడు. అయితే తొలి టెస్టుకు బ్రాడ్​ను తప్పించడం కాస్త వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో మైకేల్ అథెర్టన్ స్పందించాడు.

“చాంపియన్ క్రీడాకారుడిని జట్టులో నుంచి తప్పిస్తే.. మళ్లీ అంతకు మించిన వేగంతో తిరిగి వస్తాడు. ఈ సిరీస్​లో బ్రాడ్​ను చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. ఒక్కోసారి జట్టులో చోటు దక్కనప్పుడే మన గురించి మనకు తెలుస్తుంది. బ్రాడ్ జోరు చూస్తే 500వికెట్లతో అసలు ఆగడు. 600 వికెట్ల మార్కును చేరాలని అనుకుంటాడు. అతడిలో ఎంతో స్టామినా ఉంది. సుదీర్ఘంగా బౌలింగ్ చేయగలడు” అని అథెర్టన్ అన్నాడు. 


logo