బుధవారం 25 నవంబర్ 2020
Sports - Nov 08, 2020 , 17:12:24

క్వాలిఫయర్‌-2: మరో ఫైనలిస్ట్‌ ఎవరో..?

క్వాలిఫయర్‌-2: మరో ఫైనలిస్ట్‌ ఎవరో..?

అబుదాబి: ఐపీఎల్‌ పదమూడో సీజన్‌ క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి.  వరుస విజయాలతో దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్‌ ఫైనల్‌ బెర్తుపై కన్నేసింది.  క్వాలిఫయర్‌-1లో ముంబై ఇండియన్స్‌ చేతిలో చిత్తుగా ఓడిన ఢిల్లీ.. గట్టిగా పుంజుకొని తొలిసారి తుదిపోరుకు అర్హత సాధించాలని పట్టుదలతో ఉంది. 

చివరి నాలుగు మ్యాచ్‌ల్లో సంచలన విజయాలు నమోదు చేసిన డేవిడ్‌ వార్నర్‌సేన మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది. మరోవైపు చివరి ఆరు మ్యాచ్‌ల్లో ఐదు పరాజయాలతో ఢీలా పడిన ఢిల్లీ ఒత్తిడిని జయించి సమిష్టిగా రాణించాలనుకుంటోంది.  ఆల్‌రౌండ్‌షోతో అదరగొడుతున్న  సన్‌రైజర్స్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రికెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

 ఉత్కంఠ పోరాటాల్లో తేలిపోయే ఢిల్లీ.. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఏడు ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లు ఆడి అందులో ఆరింట ఓడింది. ఆ గెలిచిన ఒక్కటి హైదరాబాద్‌పైనే కావడం  క్యాపిటల్స్‌కు ఊరటనిచ్చే అంశం.