ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Sports - Aug 26, 2020 , 11:40:45

అబుదాబిలో క‌ఠిన నిబంధ‌న‌లు.. ఐపీఎల్ షెడ్యూల్ ఆల‌స్యం

అబుదాబిలో క‌ఠిన నిబంధ‌న‌లు.. ఐపీఎల్ షెడ్యూల్ ఆల‌స్యం

హైద‌రాబాద్‌: దుబాయ్‌లో జ‌రిగే ఐపీఎల్ టోర్నీ తేదీలు ఖ‌రారు అయినా.. మ్యాచ్ షెడ్యూల్ మాత్రం ఇంకా విడుద‌ల కాలేదు.  అయితే అబుదాబిలో ఉన్న క‌ఠిన‌మైన కోవిడ్ నిబంధ‌న‌ల వ‌ల్లే.. మ్యాచ్ షెడ్యూల్ ఆల‌స్యం అవుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు బీసీసీఐ తెగ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు కూడా అర్థ‌మ‌వుతున్న‌ది. దుబాయ్‌, షార్జాల‌తో పోలిస్తే.. అబుదాబిలో కోవిడ్ నిబంధ‌న‌లు మ‌రింత క‌ఠినంగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో అక్క‌డ మ్యాచ్‌లు నిర్వ‌హించాలా వ‌ద్దా అన్న ఆలోచ‌న‌ల్లో బీసీసీఐ ఉన్న‌ట్లు ప్రాథ‌మికంగా తెలుస్తోంది.  ఐపీఎల్‌లో పాల్గొనే 8 జ‌ట్లు ప్ర‌స్తుతం గ‌ల్ఫ్‌లో ల్యాండ్ అయ్యాయి. కేవ‌లం ముంబై ఇండియ‌న్స్‌, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్ల‌కు మాత్ర‌మే అబుదాబి బేస్‌గా ఉన్న‌ది. మిగితా ఆరు జ‌ట్లు దుబాయ్‌లో ఉంటున్నాయి.  దుబాయ్‌లోనే క్వారెంటైన్‌లో ఉన్న ఐపీఎల్ గ‌వ‌ర్న‌ర్ కౌన్సిల్ చైర్మ‌న్ బ్రిజేశ్ ప‌టేల్‌.. ఈ వారం చివ‌ర లోగా ఐపీఎల్ మ్యాచ్ షెడ్యూల్‌ను విడుద‌ల చేసే అవ‌కాశాలు ఉన్నాయి. 

అయిదు రోజుల‌కు ఒక‌సారి కోవిడ్ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని బీసీసీఐ నిబంధ‌న పెట్టినా.. అబుదాడిలో మాత్రం ఆ నిబంధ‌న‌లు మ‌రింత క‌ఠినంగా ఉన్నాయి.  అబుదాబిలోకి వ‌చ్చే ప్ర‌తి ఒక్క‌రూ ఎంట్రీ పాయింట్ వ‌ద్ద క‌చ్చితంగా ప‌రీక్ష చేయించుకోవాలి. 50 దిర్‌హ‌మ్‌లు చెల్లిస్తే వెంట‌నే ప‌రీక్ష చేస్తారు. ఆ రిపోర్ట్ 48 గంట‌ల వ‌ర‌కు ప‌నిచేస్తుంది.  ఈ నేప‌థ్యంలో దుబాయ్ మ్యాచ్‌ల‌ను సింగిల్ లెగ్‌లో పూర్తి చేయాల‌ని బీసీసీఐ ప్ర‌య‌త్నిస్తున్న‌ది. కానీ దుబాయ్ బేస్‌లో ఉన్న జ‌ట్లతో అబుదాబిలో మ్యాచ్‌ల‌ను నిర్వ‌హించ‌డం క‌ష్ట‌సాధ్యంగా క‌నిపిస్తున్న‌ది. ఈ మ్యాచ్‌ల అంశంలో బీసీసీఐ స‌మాలోచ‌న‌లు చేస్తున్న‌ది. మ్యాచ్ అధికారులు, కామెంటేట‌ర్లు, టీవీ సిబ్బంది, ఈవెంట్ మేనేజ్మెంట్ సిబ్బంది.. రావ‌డం పోవ‌డం పెద్ద ఇబ్బందిగా మారుతుంద‌ని బీసీసీఐ అధికారులు చెప్పారు. అయితే సెప్టెంబ‌ర్ 19వ తేదీన డిఫెండింగ్ చాంపియ‌న్స్ ముంబై ఇండియ‌న్స్‌తో చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ల‌ప‌డ‌నున్న‌ది. 


logo