గురువారం 16 జూలై 2020
Sports - Jun 02, 2020 , 00:26:04

నేనూ బాధితుడినే: గేల్‌

నేనూ బాధితుడినే: గేల్‌

న్యూఢిల్లీ: జాతి విద్వేషంతో కూడిన మాటలను తాను కూడా పలుసార్లు ఎదుర్కొన్నానని వెస్టిండీస్‌ ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌ అన్నాడు. జాత్యంహకారానికి జెంటిల్మెన్‌ గేమ్‌ క్రికెట్‌ కూడా మినహాయింపు కాదని సోమవారం ట్వీట్‌ చేశాడు. అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతికి పోలీసు కారణమవడంపై అక్కడ తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న తరుణంలో.. గేల్‌ కూడా గళమెత్తాడు. జాతి విద్వేషం ఫుట్‌బాల్‌లోనే కాకుండా క్రికెట్‌లోనూ ఉందని గేల్‌ వెల్లడించాడు. నల్లజాతీయుడిగా ఉన్నందుకు తాను గర్వపడుతున్నానని క్రిస్‌ గేల్‌ పేర్కొన్నాడు. మరోవైపు ఫ్లాయిడ్‌ హత్యపై ఎఫ్‌వన్‌ రేసర్లు స్పందించకపోవడంపై బ్రిటన్‌ స్టార్‌ రేసర్‌ లూయిస్‌ హామిల్టన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. 


logo