ఆదివారం 12 జూలై 2020
Sports - Jun 17, 2020 , 22:52:30

బెన్‌స్టోక్స్ విరాట్‌లా..

బెన్‌స్టోక్స్ విరాట్‌లా..

జ‌ట్టును ముందుకు న‌డిపిస్తాడ‌న్న‌జో రూట్ 


లండ‌న్:  టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలా.. బెన్ స్టోక్స్ కూడా జ‌ట్టును ముందుండి న‌డిపిస్తాడ‌ని ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ అభిప్రాయ‌ప‌డ్డాడు. వ‌చ్చే నెల‌లో వెస్టిండీస్‌తో జ‌రుగనున్న టెస్టు సిరీస్‌లో తొలి టెస్టుకు రూట్ అందుబాటులో ఉండ‌టం అనుమానంగా మారింది. రూట్ భార్య రెండో బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌నుండ‌టంతో అత‌డు అందుబాటులో లేకుంటే.. వైస్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంగ్లండ్ జ‌ట్టుకు సార‌థ్యం వ‌హించ‌నున్నాడు. దీనిపై రూట్ స్పందిస్తూ..

`స్టోక్స్ కూడా విరాట్ కోహ్లీ లాంటి వాడే. దూకుడుగా జ‌ట్టును ముందుకు న‌డిపించ‌గ‌ల‌డు. కోహ్లీ ఎలాగైతే చ‌క్క‌టి ప్ర‌ద‌ర్శ‌న చేస్తూ జ‌ట్టుకు మార్గ‌నిర్దేశనం చేయ‌గ‌ల‌డు. నాయ‌కుడి ప్ర‌ద‌ర్శ‌న బాగుంటే జ‌ట్టు కూడా స్ఫూర్తి పొందుతుంది. ` అని అన్నాడు. క‌రోనా వైర‌స్ కార‌ణంగా విశ్వ‌వ్యాప్తంగా క్రికెట్ టోర్నీల‌న్నీ ర‌ద్దు కాగా.. వ‌చ్చే నెల ఇంగ్లండ్‌, వెస్టిండీస్ జ‌ట్ల మ‌ధ్య బ‌యో సెక్యూర్ వాతావ‌ర‌ణంలో మూడు టెస్టుల సిరీస్ జ‌ర‌గ‌నుంది. 


logo