ఆదివారం 07 జూన్ 2020
Sports - Apr 03, 2020 , 16:48:57

ఐపీఎల్ 2020 పై ఇంకా ఆసక్తిగా ఉంది : పాట్ కమ్మిన్స్

ఐపీఎల్ 2020 పై ఇంకా ఆసక్తిగా ఉంది : పాట్ కమ్మిన్స్

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌( IPL) ఈ టోర్నీపై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్నక్రేజ్ వేరే చెప్ప‌న‌క్క‌ర‌లేదు. క్రికెట్ అభిమానుల‌తో పాటు ప్లేయ‌ర్స్ కూడా  దీనిపై ఎంతో క్రేజ్  ఉంటుంది. ఇంకా ఆట‌గాళ్ల‌కు త‌మ టాలెంట్‌తో పాటు..కాసుల వ‌ర్షం కురిపిస్తుంది. ఎంతో మంది ప్లేయ‌ర్స్‌కు ఫ్లాట్ ఫామ్ గా నిలిచింది ఐపీఎల్‌. కరోనా కార‌ణంగా వాయిదా ప‌డ్డ ఐపీఎల్ ఎలాగైనా ప్రారంభ‌మైతే బావుండ‌ని అభిమానులు, ఆట‌గాళ్లు త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితులు త‌గ్గాక మినీ ఐపీఎల్ నిర్వ‌హిస్తే బాగుంటుంద‌ని కోరుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమ్మిన్స్ టోర్నీ సాగాల‌ని ఆశాభావం వ్య‌క్తం చేశాడు. ఐపీఎల్ వాయిదా పడిందే త‌ప్ప‌.. ఇంకా రద్దు కాలేద‌ని.. ఐపీఎల్‌పై ఇంకా ఆశలు ఉన్నాయని తెలియజేసాడు. కాగా ఐపీఎల్ లీగ్ చరిత్రలో అత్యధిక ధర కు అమ్ముడు పోయిన విదేశీ ఆటగాడిగా క‌మ్మిన్స్‌ రికార్డు నెల‌కొల్పాడు. పాట్ కమ్మిన్స్‌ను గత ఏడాది డిసెంబర్ లో జరిగిన వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.15.5 కోట్లకు కొనుగోలు చేసింది.


logo