శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Feb 26, 2020 , 15:00:39

‘ది హండ్రెడ్‌’: వెల్ష్‌ ఫైర్‌ కెప్టెన్‌గా స్టీవ్‌ స్మిత్‌

‘ది హండ్రెడ్‌’: వెల్ష్‌ ఫైర్‌ కెప్టెన్‌గా స్టీవ్‌ స్మిత్‌

జులై 17 నుంచి ది హండ్రెడ్‌ టోర్నీ ఆరంభంకానుంది.

లండన్‌: అంతర్జాతీయ క్రికెట్లో మరో   రసవత్తర పోరును అభిమానులకు పరిచయం చేసేందుకు ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు సిద్ధమైంది.  టీ20 కంటే పొట్టిదైన  ‘ది హండ్రెడ్‌’ లీగ్‌కు ఇప్పటికే  ఆటగాళ్ల ఎంపిక పూర్తవగా తాజాగా ఆయా ఫ్రాంఛైజీలు తమ జట్లకు కెప్టెన్లను నియమించేందుకు కసరత్తులు చేస్తున్నాయి.  తాజాగా వెల్ష్‌ ఫైర్‌ ఫ్రాంచైజీ  ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌కు జట్టు పగ్గాలు అప్పగించింది. బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతంలో చిక్కుకొని ఏడాది నిషేధం ఎదుర్కోవడంతో 2018లో ఆస్ట్రేలియా కెప్టెన్సీ నుంచి స్మిత్‌ను తప్పించారు. నిషేధం అనంతరం ఆసీస్‌ జాతీయ జట్టులోకి వచ్చిన స్మిత్‌ అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా ఆడుతున్నాడు.  

తొలి సీజన్‌లో వెల్ష్‌ టీమ్‌కు తనను కెప్టెన్‌గా నియమించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు స్మిత్‌ పేర్కొన్నాడు.  మైదానంలో జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు స్మిత్‌ అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని ఆ టీమ్‌ హెడ్‌ కోచ్‌ గ్యారీ కిర్‌స్టెన్‌ తెలిపారు. వెల్ష్‌ ఫైర్‌ జట్టులో జానీ బెయిర్‌స్టో, మిచెల్‌ స్టార్క్‌, స్టీవ్‌ స్మిత్‌, టామ్‌ బాంటన్‌, లియామ్‌ ఫ్లంకెట్‌ తదితర స్టార్‌ ప్లేయర్లు ఉన్నారు.   జులై 17 నుంచి ది హండ్రెడ్‌ టోర్నీ ఆరంభంకానుంది. ఇంగ్లాండ్‌ వేదికగా ఈ లీగ్‌లో మొత్తం 8 జట్లు తలపడనున్నాయి. ఒక ఇన్నింగ్స్‌కు 100 బంతులు మాత్రమే ఉండడం ఈ లీగ్‌ స్పెషాలిటీ. ఒక్కో బౌలర్‌ గరిష్టంగా 20బంతులు మాత్రమే బౌలింగ్‌ చేయాల్సి ఉంటుంది. ప్రతీ ఇన్నింగ్స్‌లో మొదటి 25బంతుల వరకు పవర్‌ ప్లే ఉంటుంది. 


logo