శుక్రవారం 22 జనవరి 2021
Sports - Jan 12, 2021 , 15:36:44

కోహ్లీని అధిగమించిన స్మిత్‌

కోహ్లీని అధిగమించిన స్మిత్‌

దుబాయ్‌: ఐసీసీ టెస్ట్‌ బ్యాట్స్‌మన్‌ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ స్టీవ్ స్మిత్(900 రేటింగ్‌ పాయింట్లు) టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(870 రేటింగ్‌ పాయింట్లు)ని అధిగమించి  రెండో   స్థానానికి చేరుకున్నాడు.  సిడ్నీ వేదికగా భారత్‌తో జరిగిన మూడో  టెస్టులో గొప్పగా రాణించిన స్మిత్‌(131, 81)   మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. 

ప్రస్తుతం పెటర్నిటీ లీవ్‌లో ఉన్న కోహ్లీ మూడో స్థానానికి పడిపోయాడు. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ 919 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు.  భారత్‌ నుంచి రహానె ఒక ర్యాంకు కోల్పోయి ఏడో స్థానానికి పరిమితం కాగా టెస్టు స్పెషలిస్ట్‌ పుజారా రెండు స్థానాలను మెరుగుపరచుకొని ఎనిమిదో ర్యాంకు సాధించాడు. 


logo