మంగళవారం 27 అక్టోబర్ 2020
Sports - Sep 27, 2020 , 22:22:58

RR vs KXIP: స్టీవ్‌ స్మిత్‌ ఔట్‌

RR vs KXIP: స్టీవ్‌ స్మిత్‌ ఔట్‌

షార్జా: కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ నిర్దేశించిన  భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో  దిగిన  రాజస్థాన్‌ రాయల్స్‌ రెండో వికెట్‌ కోల్పోయింది.    నీషమ్‌ బౌలింగ్‌లో అర్ధశతకం సాధించిన  కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్(50)‌  అదే ఓవర్‌ ఆఖరి బంతికి భారీ షాట్‌ ఆడి షమీ చేతికి చిక్కాడు. రెండో వికెట్‌కు స్మిత్‌,  సంజూ శాంసన్‌ జోడీ 81 పరుగులు జోడించింది.

మరో ఎండ్‌లో శాంసన్‌ తనదైన మార్క్‌షాట్లతో విరుచుకుపడుతున్నాడు.  10 ఓవర్లకు రాజస్థాన్‌ రెండు వికెట్లకు 104 పరుగులు చేసింది. శాంసన్‌(43), రాహుల్‌ తెవాటియా(1) క్రీజులో ఉన్నారు. రాజస్థాన్‌ విజయానికి ఇంకా 60 బంతుల్లో 120  పరుగులు చేయాల్సి ఉంది. మయాంక్‌ అగర్వాల్‌(106: 50 బంతుల్లో 10ఫోర్లు, 7సిక్సర్లు) అద్భుత శతకంతో మెరువగా కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(69:54 బంతుల్లో 7ఫోర్లు, సిక్స్‌) అర్ధశతకంతో రాణించడంతో పంజాబ్‌ రెండు వికెట్లకు 223 పరుగులు చేసింది.


logo