శనివారం 06 మార్చి 2021
Sports - Jan 22, 2021 , 00:46:55

స్మిత్‌ ఒక్కడే: చాపెల్‌

స్మిత్‌ ఒక్కడే: చాపెల్‌

సిడ్నీ: ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్‌గా మళ్లీ స్టీవ్‌ స్మిత్‌ను నియమించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అతడు మినహా మరో ఆప్షన్‌ లేదని ఆ దేశ మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ చాపెల్‌ అభిప్రాయపడ్డాడు. 2018 బాల్‌ ట్యాంపరింగ్‌ ఉందంతంతో సారథ్యం కోల్పోయిన అతడికే మరోసారి బాధ్యతలు అప్పగించడం ఉత్తమమని అన్నాడు. సొంతగడ్డపై భారత్‌ చేతిలో 1-2తో ఆసీస్‌ టెస్టు సిరీస్‌ ఓడాక కెప్టెన్సీ నుంచి పైన్‌కు ఉద్వాసన పలకాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అతడు కీపింగ్‌లోనూ ఘోరంగా విఫమయ్యాడు. ఈ నేపథ్యంలో చాపెల్‌ సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. బాల్‌ ట్యాంపరింగ్‌కు సూత్రధారి అయిన ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌పై జీవితకాల కెప్టెన్సీ నిషేధం ఉందని, అందుకే ఉన్న ఒక్క ఆప్షన్‌ స్మిత్‌ అని స్పష్టం చేశాడు. కాగా స్టార్‌ పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నాడు. 

VIDEOS

logo