శనివారం 24 అక్టోబర్ 2020
Sports - Sep 27, 2020 , 17:15:49

RRvKXIP: బట్లర్‌ వచ్చేస్తున్నాడు!

RRvKXIP: బట్లర్‌ వచ్చేస్తున్నాడు!

షార్జా:  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-13వ సీజన్‌లో ఆదివారం మరో బిగ్‌ఫైట్‌ జరగనుంది. షార్జా క్రికెట్‌ మైదానంలో  రాజస్థాన్‌ రాయల్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. గత మ్యాచ్‌ల్లో  రెండూ జట్లు ఆల్‌రౌండ్‌షోతో ప్రత్యర్థి జట్లను మట్టికరిపించాయి. ఈ నేపథ్యంలో పోరు రసవత్తరంగా సాగనుంది. పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌ సూపర్‌ ఫామ్‌లో ఉండగా  బౌలింగ్‌ విభాగం‌ కూడా పటిష్ఠంగానే ఉంది.

మరోవైపు గత మ్యాచ్‌కు దూరమైన రాజస్థాన్‌ రాయల్స్‌ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ తుదిజట్టులోకి వచ్చే అవకాశం ఉన్నది. బట్లర్‌లో ఓపెనర్‌గా బరిలో దిగితే  కెప్టెన్‌ స్టీవ్‌  స్మిత్‌ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు రావొచ్చు. యువ ఆటగాడు సంజూ శాంసన్‌పైనే అందరి దృష్టినెలకొంది.   షార్జా బౌండరీ పొడవు తక్కువగా ఉండటంతో రాత్రి మ్యాచ్‌లోనూ పరుగుల వరద పారనుంది.  ఆడిన రెండు మ్యాచ్‌ల్లో పంజాబ్‌ ఒకటి గెలవగా..తొలి మ్యాచ్‌ విజయంతో రాజస్థాన్‌ సీజన్‌ను ఘనంగా ఆరంభించింది. 


logo