గురువారం 03 డిసెంబర్ 2020
Sports - Sep 21, 2020 , 20:06:22

చెన్నైతో మ్యాచ్‌కు స్టీవ్‌ స్మిత్‌ రెడీ

చెన్నైతో మ్యాచ్‌కు స్టీవ్‌ స్మిత్‌ రెడీ

 దుబాయ్‌:  రాజస్థాన్‌ రాయల్స్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌.  మంగళవారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఆడేందుకు రాజస్థాన్‌  కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌కు అనుమతి లభించింది. తలకు గాయం కావడంతో ఇటీవల ఇంగ్లాండ్‌తో  మూడు వన్డేల  సిరీస్‌కు స్మిత్‌ దూరమయ్యాడు. తొలి వన్డే ఆరంభానికి కొన్ని గంటల ముందే ప్రాక్టీస్‌ చేస్తుండగా తలకు దెబ్బతగలడంతో సిరీస్‌ నుంచి తప్పుకున్నాడు. అప్పటి నుంచి  నిరంతరం  ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూనే ఉన్నాడు.  రాజస్థాన్‌ ఆరంభ మ్యాచ్‌లకు  స్మిత్‌ బరిలో ఉండటం లేదని వస్తున్న వార్తలపై ఆ జట్టు ప్రధాన కోచ్‌ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ క్లారిటీ ఇచ్చాడు.

'స్టీవ్‌ స్మిత్‌ అందుబాటులోకి రావడం అనేది చాలా శుభవార్త కలిగించే వార్త.  రాజస్థాన్‌ ఆడే తొలి మ్యాచ్‌లో ఆడేందుకు అతడు రెడీగా ఉన్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత ఆటగాళ్లందరూ  లీగ్‌ కోసం బాగా  సన్నద్ధమయ్యారు.   స్మిత్‌ రాకతో జట్టు మరింత బలోపేతమైంది.  అన్ని విభాగాల్లో జట్టు బలంగా ఉన్నది. చెన్నైతో జరిగే పోరులో మా జట్టు ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలని  ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని' ఆండ్రూ పేర్కొన్నారు.  రాజస్థాన్‌ ఆడే ఆరంభ మ్యాచ్‌కు ఆ జట్టు వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ దూరంకానున్నాడు. అతని క్వారంటైన్‌ వ్యవధి పూర్తవకపోవడమే ఇందుకు కారణం.