శుక్రవారం 27 నవంబర్ 2020
Sports - Oct 03, 2020 , 16:03:58

RCB vs RR: రాజస్థాన్‌కు షాక్‌..మూడు ఓవర్లలో మూడు వికెట్లు

RCB vs RR: రాజస్థాన్‌కు షాక్‌..మూడు ఓవర్లలో మూడు వికెట్లు

అబుదాబి: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు ఊహించని షాక్‌ తగిలింది.  స్వల్ప స్కోరుకే రాజస్థాన్‌ మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. బెంగళూరు బౌలర్ల ధాటికి 31 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకుంది. ఇసురు ఉడానా వేసిన మూడో ఓవర్లో కెప్టెన్‌ స్మిత్(5)‌ బౌల్డయ్యాడు. నవదీప్‌ సైనీ వేసిన నాలుగో ఓవర్లో  దూకుడుగా ఆడుతున్న   ఓపెనర్‌ బట్లర్(22)‌..పడిక్కల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  

స్పిన్నర్‌ చాహల్‌ వేసిన ఐదో ఓవర్లో హార్డ్‌హిట్టర్‌ సంజూ శాంసన్‌(4) రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.  పవర్‌ప్లే ముగిసేలోపే రాజస్థాన్‌ ౩ వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది.  రాబిన్‌ ఉతప్ప(5), లామ్రోర్‌(2) క్రీజులో  ఉన్నారు. పవర్‌ప్లేలో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన కోహ్లీసేన మ్యాచ్‌పై పట్టుబిగించింది.