శుక్రవారం 10 జూలై 2020
Sports - Jun 02, 2020 , 10:15:17

ఆసీస్‌ క్రికెటర్ల ప్రాక్టీస్‌ షురూ

 ఆసీస్‌ క్రికెటర్ల ప్రాక్టీస్‌ షురూ

సిడ్నీ: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని క్రీడా పోటీలు, ఈవెంట్లు స్తంభించిపోయిన విషయం తెలిసిందే. కొన్ని దేశాల్లో కొవిడ్‌-19 వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో నెమ్మదిగా క్రీడాప్రాంగణాలు, స్టేడియాలు తెరుచుకోవడంతో  క్రీడాకారులు మైదానాల్లో అడుగుపెడుతున్నారు. లాక్‌డౌన్‌ వల్ల రెండు నెలలకు పైగా ఇళ్లకే పరిమితమైన ఆస్ట్రేలియా క్రికెటర్లు తిరిగి మైదానంలో అడుగుపెట్టారు. 

ఆసీస్‌ టాప్‌ క్రికెటర్లు సిడ్నీ ఒలింపిక్‌ పార్క్‌లో ట్రైనింగ్‌ పునఃప్రారంభించారు.  స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, స్టార్క్‌  సాధన చేశారు. ఆగస్టు 9 నుంచి అంతర్జాతీయ క్రికెట్‌ను ప్రారంభించేందకు క్రికెట్‌ ఆస్ట్రేలియా ఇప్పటికే షెడ్యూల్‌ను కూడా ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు పూర్తి ఫిట్‌నెస్‌  సాధించేందుకు సన్నద్ధమయ్యారు. 


logo