మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Sports - Sep 16, 2020 , 17:50:57

బయో బబుల్ అచ్చం బిగ్ బాస్ ఇల్లులా ఉంది : శిఖర్ ధావన్

బయో బబుల్ అచ్చం బిగ్ బాస్ ఇల్లులా ఉంది : శిఖర్ ధావన్

ఐపీఎల్ లో అడేందుకు వచ్చిన తమకు బయో బబుల్ పాటించాలని సూచించడం అచ్చం బిగ్ బాస్ ఇంట్లో ఉన్నట్లుగా ఉన్నదని ఢిల్లీ డేర్ డెవల్స్ జట్టు సభ్యుడు శిఖర్ ధావన్ అన్నారు. మా మానసిక బలాన్ని పరీక్షించడం సంతోషంగా ఉంది అని యూఏఈలోని తన హోటల్ గది నుంచి జూమ్ కాల్ ద్వారా ఆయన మాట్లాడారు.

"సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ టోర్నమెంట్ లో సుమారు 80 రోజులపాటు అన్ని జట్ల ఆటగాళ్ల ప్రపంచాలు మారిపోనున్నాయి. వారు హోటల్ నుంచి మైదానానికి, మ్యాచ్ పూర్తికాగానే తిరిగి హోటల్ కు చేరుకుంటారు. మ్యాచ్ ఆడే స్టేడియాల్లో ప్రేక్షకులు ఎవరూ ఉండరు. ఖాళీ స్టేడియాల్లో స్థిరంగా గెలుపే ధ్యేయంగా ఆడాల్సి ఉంటుంది. ఇది అచ్చం టీవీలో వచ్చే బిగ్ బాస్ షోను తలపిస్తుంది" అని అన్నారు. "బయో బబుల్ అందరికీ కొత్త విషయం. సవాలు కంటే ప్రతి అంశంలో మెరుగుపడే అవకాశంగా నేను చూస్తున్నాను. నేను వినోదాన్ని పంచుతాను. అదేసమయంలో సానుకూలంగా ఆడి విజయం సాధించేందుకు కష్టపడతాను” అని ధావన్ చెప్పారు. ఈ సీజన్ టోర్నమెంట్‌లో విజయం.. ఆటగాళ్ళు ఈ కొత్త రియాలిటీని ఎలా నావిగేట్ చేస్తారనే దానిపై ఆధారపడి ఉంటుందని ధావన్ తెలిపారు. ప్రేక్షకులు లేకుండా పరిమితుల మధ్య క్రికెట్ అడటం ప్రతి ఒక్కరిపై భారీ ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ మానసిక సవాలును ఎదుర్కోవటానికి శిఖర్ ధావన్.. లాక్డౌన్ కాలంలో ధ్యానం, యోగా అభ్యాసాలు చేసి శారీరకంగా, మానసికంగా గట్టిపడ్డాడు. 34 ఏండ్ల ఈ ఓపెనర్ జనవరి తర్వాత తొలిసారి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ను ఆదివారం ఢీకొననున్నాడు.


logo