శనివారం 27 ఫిబ్రవరి 2021
Sports - Feb 06, 2021 , 00:36:11

వెయిట్‌లిఫ్టర్లకు మంత్రి అభినందన

వెయిట్‌లిఫ్టర్లకు మంత్రి అభినందన

హైదరాబాద్‌, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): ఖేలో ఇండియాలో భాగంగా జాతీయ వెయిట్‌ లిఫ్టింగ్‌ ఫెడరేషన్‌ నిర్వహించనున్న అసెస్‌మెంట్‌ క్యాంపునకు ఎంపికైన ఐదుగురు తెలంగాణ వెయిట్‌ లిఫ్టర్లను రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అభినందించారు. రవీంద్ర భారతిలోని కార్యాలయంలో శుక్రవారం వెయిట్‌లిఫ్టర్లు సాయివర్ధన్‌, శేషసాయి, భరత్‌ కుమార్‌, సహస్ర, స్వరాజ్‌ చౌహాన్‌ మంత్రిని కలిశారు. ఈ కార్యక్రమంలో సాట్స్‌ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అసెస్‌మెంట్‌ క్యాంపు ఈ నెల 8 నుంచి మార్చి 8వ తేదీ వరకు ఔరంగాబాద్‌లో జరుగనుంది. 


VIDEOS

logo