ఆదివారం 24 మే 2020
Sports - Feb 28, 2020 , 00:06:45

ప్రపంచ సెయిలింగ్‌ టోర్నీలో ఝాన్సీ, ధరణి

ప్రపంచ సెయిలింగ్‌ టోర్నీలో ఝాన్సీ, ధరణి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: ఇటలీలో జరిగే ప్రపంచ సెయిలింగ్‌ చాంపియన్‌షిప్‌ కుదించిన జాబితాలో  రాష్ట్రానికి చెందిన ఝాన్సీ ప్రియ, ధరణి లావేటి ఎంపికయ్యారు. మే నెలలో ముంబైలో జరిగే జాతీయ సెయిలింగ్‌ చాంపియన్‌షిప్‌లో ప్రదర్శన ఆధారంగా ప్రపంచటోర్నీలో వీరి తుది ఎంపిక ఆధారపడి ఉంది. వీరు జాతీయ సెయిలింగ్‌ టోర్నీలో సత్తాచాటితే భారత్‌ తరఫున బరిలోకి దిగే అవకాశం లభిస్తుంది. గతేడాది ఒమన్‌లో జరిగిన  ఆసియా సెయిలింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఆకట్టుకున్న ఝాన్సీ ప్రస్తుతం రెండో ర్యాంక్‌లో కొనసాగుతున్నది. జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో మన అమ్మాయిలు ఆకట్టుకోవడం వెనుక కఠోర శ్రమ దాగుందని హైదరాబాద్‌ యాచ్‌ క్లబ్‌ అధ్యక్షుడు, కోచ్‌ సుహేమ్‌ షేక్‌ అన్నారు. యాచ్‌క్లబ్‌ తీసుకొచ్చిన నావిక కార్యక్రమం ద్వారా అద్భుత ప్రతిభ కల్గిన సెయిలర్లు వెలుగులోకి వస్తున్నారని తెలిపారు. ఝాన్సీతో పాటు ఆమె సో దరి ధరణి, రవళి, వైష్ణవి ప్రస్తుతం రసూల్‌పూరలోని ఉద్భవ్‌ స్కూల్‌ లో చదువుతున్నారు. 
logo