శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Sports - Sep 16, 2020 , 20:02:41

రీల్‌ బిఫోర్‌ రియర్‌..టాప్‌ గేర్‌లో స్టార్‌ క్రికెటర్లు

రీల్‌ బిఫోర్‌ రియర్‌..టాప్‌ గేర్‌లో స్టార్‌ క్రికెటర్లు

దుబాయ్‌: యూఏఈలో క్వారంటైన్‌ పూర్తైన తర్వాత అన్ని జట్లు కూడా రెండు వారాలు పూర్తిగా ఫిట్‌నెస్‌, ట్రైనింగ్‌కే కేటాయించాయి. ఇప్పుడు అన్ని  ఫ్రాంఛైజీలు కూడా జట్టు కూర్పుపై దృష్టిసారించాయి.  జట్టును రెండు గ్రూపులుగా విభజించి ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నాయి.  నెట్‌ సెషన్స్‌ తర్వాత సన్నాహాక మ్యాచ్‌లు నిర్వహిస్తూ పోటీ క్రికెట్‌ కోసం జట్టును సన్నద్ధం చేస్తున్నాయి.

అసలుసిసలు మ్యాచ్‌ అనుభూతిని ఆటగాళ్లు పొందేందుకు వీటిని నిర్వహిస్తున్నారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్లు ఇంట్రా-స్క్వాడ్‌ మ్యాచ్‌లను నిర్వహించగా ఆటగాళ్లు ధనాధన్‌ బ్యాటింగ్‌తో అలరించారు. బౌలర్లు కూడా బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందిపెట్టేలా కట్టుదిట్టంగా బంతులేస్తున్నారు.  సెప్టెంబర్‌ 19 నుంచి ఐపీఎల్‌ 2020 సీజన్‌ ప్రారంభంకానుంది.logo