సోమవారం 23 నవంబర్ 2020
Sports - Oct 11, 2020 , 02:42:05

కేటీఆర్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ ప్రారంభం

కేటీఆర్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ ప్రారంభం

అహ్మద్‌నగర్‌: క్రీడాకారుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేసేలా నూతన క్రీడా పాలసీని అమలు చేయనున్నట్లు రాష్ట్ర క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. శనివారం హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లోని స్పోర్ట్స్‌ కోచింగ్‌ ఫౌండేషన్‌(ఎస్‌సీఎఫ్‌) మైదానంలో కేటీఆర్‌ ఫుట్‌బాల్‌ టోర్నీని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ర్టాన్ని క్రీడా హబ్‌గా మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. క్రీడా పాలసీ రూపకల్పన కోసం క్యాబినెట్‌ సబ్‌కమిటీని నియమించారని మంత్రి వెల్లడించారు. దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందించి క్రీడాభివృద్ధి కోసం పెద్దపీట వేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌, ఉప్పల్‌ టీఆర్‌ఎస్‌ మైనార్టీ విభాగం అధ్యక్షులు ఖాజా బద్రుద్దీన్‌ , మన్నన్‌ ఖాన్‌ , షేక్‌ ఖాసిం తదితరులు పాల్గొన్నారు.