బుధవారం 25 నవంబర్ 2020
Sports - Oct 17, 2020 , 01:12:22

క్వార్టర్స్‌లో శ్రీకాంత్‌ ఓటమి

క్వార్టర్స్‌లో శ్రీకాంత్‌ ఓటమి

ఒడెన్స్‌: డెన్మార్క్‌ ఓపెన్‌లో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన అగ్రశ్రేణి ఆటగాడు కిడాంబి శ్రీకాంత్‌ ఓడిపోయాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో ఐదో సీడ్‌ శ్రీకాంత్‌ 22-20, 13-21, 16-21తో రెండో సీడ్‌ చౌ టైన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో పరాజయం పాలయ్యాడు. గంటా రెండు నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్‌ నెగ్గిన కిడాంబి.. ఆ తర్వాత వరుసగా రెండు గేమ్‌లలో ఓటమి పాలయ్యాడు.