మంగళవారం 11 ఆగస్టు 2020
Sports - Jul 05, 2020 , 13:23:16

శ్రీలంక క్రికెటర్‌ కుశాల్‌ మెండిస్‌ అరెస్ట్‌

శ్రీలంక క్రికెటర్‌ కుశాల్‌ మెండిస్‌ అరెస్ట్‌

కొలంబో: శ్రీలంక వికెట్ కీపర్‌, బ్యాట్స్‌మన్‌  కుశాల్‌ మెండిస్‌ను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు.  ఆదివారం తెల్లవారుజామున కొలంబో శివారులోని పనాదుర వద్ద కుశాల్  కారు అదుపుతప్పి సైకిల్‌పై వెళ్తున్న 64ఏండ్ల  వృద్ధుడిని ఢీకొట్టడంతో అతడు మృతి చెందాడు.   మెండిస్‌ని ఇవాళ అరెస్టు చేసిన స్థానిక పోలీసులు సాయంత్రంలోగా మెజిస్ట్రేట్ ముందు హాజరపరుస్తామని  తెలిపారు. 

ప్రమాదం సమయంలో  కుశాల్‌ కారుని మితిమీరిన వేగంతో నడిపినట్లు తెలుస్తున్నది.  ఇద్దరిలో ఎవరైనా మద్యం మత్తులో ఉన్నారా అనేది ఇంకా నిర్ధారించాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. 25 ఏండ్ల కుశాల్‌ ఇప్పటి వరకు లంక తరఫున 44 టెస్టులు, 76 వన్డేలు, 26 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.  కోవిడ్‌-19 లాక్‌డౌన్‌ తర్వాత శిక్షణ ప్రారంభించిన  శ్రీలంక క్రికెట్‌ టీమ్‌లో మెండిస్‌ కూడా ఉన్నాడు.   logo