గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Feb 29, 2020 , 12:51:52

అదరగొట్టిన రాధా.. లంక 113 ఆలౌట్‌

అదరగొట్టిన రాధా.. లంక 113 ఆలౌట్‌

మెల్‌బోర్న్‌: మహిళల టీ-20 వరల్డ్‌కప్‌లో భారత మహిళల జట్టు అదరగొడుతోంది. ఇప్పటికే మూడు వరుస విజయాలతో సెమీస్‌ బెర్త్‌ ఖాయం చేసుకున్న టీమిండియా.. ఇవాళ శ్రీలంక జట్టుతో జరుగుతున్న చివరి లీగ్‌ మ్యాచ్‌లోనూ విజృంభించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న లంకను  నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు పగగొట్టి, 113 పరుగులకే కట్టడి చేసింది. భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా రాధా యాదవ్‌ లంక బ్యాట్స్‌వుమెన్‌ను ముప్పు తిప్పలు పెట్టింది. లంక బ్యాట్స్‌వుమెన్స్‌లో కెప్టెన్‌ చమారి ఆటపట్టు(24 బంతుల్లో 33: 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించింది.కవిశా దిల్హారీ 25 పరుగులు చేసిపర్వాలేదనిపించింది. మిగితా బ్యాట్స్‌వుమెన్‌ తక్కువ పరుగులకే పెవిలియన్‌ చేరారు.

భారత బౌలర్లలో రాధా యాదవ్‌ తన స్పిన్‌ మాయాజాలంతో 4 వికెట్లు తీసి, లంక నడ్డివిరిచింది. రాజేశ్వరీ గైక్వాడ్‌ 2 వికెట్లు, దీప్తి శర్మ, శిఖాపాండే చెరో వికెట్‌ పడగొట్టారు. దీప్తి శర్మ ఒక వికెట్‌ మాత్రమే తీసినప్పటికీ, పరుగులు నియంత్రించడంలో సఫలమైంది. 


logo
>>>>>>