శనివారం 19 సెప్టెంబర్ 2020
Sports - Aug 23, 2020 , 19:41:02

యూఏఈ బయల్దేరిన ‘హైదరాబాద్‌’!

యూఏఈ బయల్దేరిన ‘హైదరాబాద్‌’!

సెప్టెంబర్‌19న ఐపీఎల్‌ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని జట్లు దుబయ్‌ చేరుకున్నాయి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మాత్రం కాస్త ఆలస్యంగా ఆదివారం యూఏఈ బయల్దేరాయి. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆటగాళ్లు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఐపీఎల్‌ నిర్వహణకు బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. యూఏఈ చేరుకున్న ఆటగాళ్లు ఆరు రోజుల పాటు ప్రత్యేక క్వారంటైన్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. 

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌,  రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ జట్లు దుబయ్‌, అబుదాబి చేరుకొని ప్రాక్టీస్‌ కూడా మొదలుపెట్టాయి. కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ, హైదరాబాద్‌ జట్లు కూడా అక్కడికి చేరుకున్నాయని ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటగాడు ట్వీట్‌ చేశాడు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo