గురువారం 24 సెప్టెంబర్ 2020
Sports - Aug 23, 2020 , 12:24:10

'మాది సన్‌రైజర్స్‌ టీమ్‌ ఈరోజు దుబాయ్‌ పోతున్నది'

'మాది సన్‌రైజర్స్‌ టీమ్‌ ఈరోజు దుబాయ్‌ పోతున్నది'

దుబాయ్‌: ఎడారి దేశంలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) సందడి  మొదలైంది. ఇప్పటికే  ఆరు  ఫ్రాంచైజీలు  ప్రత్యేక విమానాల్లో యూఏఈలో అడుగుపెట్టాయి. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌(డీసీ),  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(ఎస్‌ఆర్‌హెచ్‌) ఆటగాళ్లు, సిబ్బంది ఆదివారం భారత్‌ నుంచి  యూఏఈ బయలుదేరారు. ఈమేరకు  సన్‌రైజర్స్‌  ఫ్రాంచైజీ  తమ ఆటగాళ్ల ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. 

ఆటగాళ్లు, సిబ్బంది ముఖానికి మాస్క్‌, షీల్డులు ధరించి ఉన్నారు. 'మాది సన్‌రైజర్స్‌ టీమ్‌ ఈరోజు దుబాయ్‌ పోతున్నది. మాకు మీరు సపోర్ట్‌ చేయండి' అంటూ వినూత్నంగా ట్వీట్‌ చేసింది.   ఎయిర్‌పోర్టులో ఢిల్లీ, హైదరాబాద్‌ ఆటగాళ్లు కలిసి ఉన్న ఫొటోను కూడా ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులతో పంచుకున్నది. 


logo