శుక్రవారం 10 జూలై 2020
Sports - Jun 21, 2020 , 19:40:35

కేరళ తరపున రంజీలో ఆడనున్న శ్రీశాంత్‌.?

కేరళ తరపున రంజీలో ఆడనున్న శ్రీశాంత్‌.?

కేరళ : టీమిండియా క్రికెటర్‌ శ్రీశాంత్‌పై బీసీసీఐ విధించిన నిషేదం ఈ ఏడాది సెప్టెంబర్‌లో ముగియనుంది. దీంతో కేరళ తరపున రంజీలో శ్రీశాంత్‌ను ఆడించాలని కేరళ క్రికెట్‌ అసొసియేషన్‌ నిర్ణయించింది. రంజీ కోసం ఎంపిక చేసే ఆటగాళ్లలో శ్రీశాంత్‌ పేరు కూడా ఉందని సమాచారం. కేరళ తరుపున మళ్లీ శ్రీశాంత్‌ ఆడాలని, కేరళలోని అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారని, దీనికి కారణం అతని ఫిట్‌నెస్‌, బౌలింగ్‌ సత్తానే అని కేరళ జట్టు కోచ్‌ యోహానన్‌ తెలిపాడు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం ఏ మ్యాచ్‌లు జరగడం లేదు. రంజీ ప్రారంభానికి ఇంక సమయం ఉండడంలో తనను ఆటపై దృష్టి పెట్టాలని పలువురు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే 2023 ప్రపంచ కప్‌ ఆడడమే తన లక్ష్యమని టీమిండియా క్రికెటర్‌ శ్రీశాంత్ అన్నాడు. తనపై తనకు నమ్మకం ఉందని తెలిపాడు. శ్రీశాంత్‌ ఈ రంజీలో రాణిస్తే తర్వాత టీం-ఏలోకి ఆ తర్వాత టీమిండియాలో స్థానం సాధించవచ్చు. కానీ దాదాపు ఏడేళ్లు క్రికెట్‌ దూరంగా శ్రశాంత్‌కు ఇది సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. logo