శనివారం 16 జనవరి 2021
Sports - Nov 26, 2020 , 12:29:23

టీ20 టోర్నీలో ఆడ‌నున్న శ్రీశాంత్‌..

టీ20 టోర్నీలో ఆడ‌నున్న శ్రీశాంత్‌..

హైద‌రాబాద్‌:  కేర‌ళ బౌల‌ర్ శ్రీశాంత్ మ‌ళ్లీ క్రికెట్‌లో అడుగుపెట్ట‌నున్నాడు.  వ‌చ్చే నెల‌లో ప్రారంభంకానున్న కేర‌ళ క్రికెట్ సంఘం టోర్నీలో అత‌ను బ‌రిలోకి దిగ‌నున్నాడు. 2013 ఐపీఎల్ సీజ‌న్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లతో ఏడేళ్లు ఆట‌కు దూర‌మైన శ్రీశాంత్ బ్యాన్ సెప్టెంబ‌ర్‌తో ముగిసింది. దీంతో అత‌ను వ‌చ్చే నెల ప్రారంభంకానున్న కేసీఏ ప్రెసిడెంట్స్ క‌ప్‌లో టీ20 టోర్నీలో ఆడే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే దీనికి ప్ర‌భుత్వం క్లియ‌రెన్స్ అవ‌స‌రం ఉంటుంది. అల‌ప్పుజాలోని క్రికెట్ మైదానంలో ఈ టోర్నీ జ‌ర‌గ‌నున్న‌ది. 37 ఏళ్ల ఫాస్ట్ బౌల‌ర్‌.. కేసీఏ టైగ‌ర్స్ త‌ర‌పున ఆడ‌నున్నాడు. కేసీఏ టీ20 టోర్నీలో మొత్తం ఆరు జ‌ట్లు పాల్గొంటున్నాయి. ప్ర‌తి జ‌ట్టు రెండుసార్లు త‌ల‌ప‌డుతాయి.  18 రోజుల పాటు జ‌రిగే టోర్నీలో మొత్తం 33 మ్యాచ్‌లు ఉంటాయి. 2013 ఐపీఎల్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ర‌పున శ్రీశాంత్ ప్రాతినిధ్యం వ‌హించాడు.  స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు.. శ్రీశాంత్‌, అజిత్ చండిలా, అంకిత్ చ‌వాన్ల‌ను అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే.