గురువారం 21 జనవరి 2021
Sports - Jan 12, 2021 , 14:26:41

ఏడేళ్ల త‌ర్వాత తొలి వికెట్ తీసిన శ్రీశాంత్‌.. వీడియో

ఏడేళ్ల త‌ర్వాత తొలి వికెట్ తీసిన శ్రీశాంత్‌.. వీడియో

ముంబై:  టీమిండియా మాజీ పేస్ బౌల‌ర్ శ్రీశాంత్ ఏడేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ కాంపిటిటివ్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. వ‌చ్చీ రాగానే ఓ అద్భుత‌మైన బంతితో త‌న తొలి వికెట్ తీసుకున్నాడు. కేర‌ళ త‌రఫున స‌య్య‌ద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడుతున్న శ్రీశాంత్‌.. పుదుచ్చెరితో జ‌రిగిన మ్యాచ్‌లో శ్రీశాంత్ 4 ఓవ‌ర్లు వేసి 29 ప‌రుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. తొలి ఓవ‌ర్‌లో 9 ప‌రుగులు ఇచ్చిన శ్రీశాంత్‌.. రెండో ఓవ‌ర్లో పుదుచ్చెరి ఓపెన‌ర్ ఫబిద్ అహ్మ‌ద్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో కేర‌ళ 6 వికెట్ల తేడాతో గెలిచింది. క‌మ్‌బ్యాక్‌లో తాను తీసిన తొలి వికెట్ వీడియోను శ్రీశాంత్ ట్విటర్‌లో షేర్ చేశాడు. ఇది కేవ‌లం ఆరంభ‌మే.. మీ ఆశీస్సుల‌తో భ‌విష్య‌త్తులో మ‌రిన్ని వికెట్లు తీసుకుంటాన‌ని చెప్పాడు.


logo