గురువారం 28 జనవరి 2021
Sports - Dec 30, 2020 , 18:02:16

శ్రీశాంత్‌ వచ్చేస్తున్నాడు..టీ20 జట్టులో చోటు

శ్రీశాంత్‌ వచ్చేస్తున్నాడు..టీ20 జట్టులో చోటు

తిరువనంతపురం: భారత సీనియర్‌ పేసర్‌ ఎస్‌ శ్రీశాంత్‌  ప్రొఫెషనల్‌ క్రికెట్‌లో  పునరాగమనం చేసేందుకు రంగం సిద్ధమైంది. వచ్చే నెలలో ఆరంభంకానున్న సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నమెంట్‌లో కేరళ జట్టు తరఫున అతడు బరిలో దిగనున్నాడు.  ఐపీఎల్‌ స్పాట్‌  ఫిక్సింగ్‌ ఆరోపణల నేపథ్యంలో అతడిపై విధించిన ఏడేళ్ల నిషేధం ఇటీవల ముగిసిన విషయం తెలిసిందే. 

జనవరి 10 నుంచి ముంబైలో జరిగే టీ20 టోర్నీ కోసం కేరళ క్రికెట్‌ సంఘం ప్రకటించిన  జట్టులో శ్రీశాంత్‌కు చోటు దక్కింది.  ఈ ఏడాది సెప్టెంబర్‌లో అతనిపై విధించిన ఏడేండ్ల  నిషేధం ముగిసిన తర్వాత శ్రీశాంత్‌ ఆడే మొదటి దేశవాళీ టోర్నీ ఇదే. టీ20 టోర్నమెంట్‌లో కేరళ జట్టుకు సంజు శాంసన్‌ నాయకత్వం వహించనున్నాడు. సచిన్‌ బేబీ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 

ఇవి కూడా చ‌దవండి

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ఎందుకంత స్పెష‌ల్‌?

ఎస్‌బీఐ కొత్త చెక్ పేమెంట్ వ్య‌వ‌స్థ ఏంటో తెలుసా?

ఐటీ రిట‌ర్న్స్ ఆల‌స్యంగా ఫైల్ చేస్తే జరిమానా ఎంతో తెలుసా?

ఆస్ట్రేలియా కన్నా ఎక్కువ పాయింట్లు.. అయినా రెండోస్థానం ఎందుకు?


logo