రోమ్: స్టార్ ప్లేయర్ హ్యారీ కేన్ డబుల్ గోల్స్‌తో అదరగొట్టడంతో ఇంగ్లండ్ జట్టు యూరో ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ సెమీస్‌లో అడుగుపెట్టింది. శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన క్వార్టర్స్‌లో ఉక్రెయిన్ను 4-0తో ఇంగ్లిష్ జట్టు ఓడించింది. 4వ నిమిషంలో కేన్ గోల్‌తో సత్తాచాటగా.. రెండో అర్ధభాగం తొలి నిమిషంలోనే హ్యారీ మగురే ఇంగ్లిష్ జట్టు ఆధిక్యాన్ని డబుల్ చేశాడు. హ్యారీ కేన్ (50వ నిమిషంలో) మరో గోల్‌తో మెరువగా.. జాతీయ జట్టులోకి వచ్చిన దశాబ్దం తర్వాత జోర్జాన్ హెండర్సన్ (63వ నిమిషంలో) తొలి గోల్ నమోదు చేసి గెలుపు పక్కా చేశాడు. ఇంగ్లండ్ దూకుడైన ఆటకు ఉక్రెయిన్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది.