ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Sports - Sep 03, 2020 , 00:59:48

కోటా సవరణతో క్రీడాకారులకు లబ్ధి జగన్‌మోహన్‌ రావు

కోటా సవరణతో క్రీడాకారులకు లబ్ధి జగన్‌మోహన్‌ రావు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీల్లో అద్భుత ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు గ్రూపు-సి స్థాయి ఉద్యోగం పొందేలా క్రీడా అంశాలను పెంచడంపై జాతీయ హ్యాండ్‌బాల్‌ సంఘం ఉపాధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఉన్న 43 క్రీడలకు కొత్తగా మరో 20 క్రీడలను చేర్చడం వలన భవిష్యత్‌లో మరింత మంది స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకుంటారని జగన్‌మోహన్‌ రావు అభిప్రాయపడ్డారు. మన రాష్ట్రంలో కూడా ఈ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు క్రీడా శాఖ, సాట్స్‌ అధికారులు కృషి చేయాలని ఆయన కోరారు. 


logo