ఆదివారం 07 జూన్ 2020
Sports - Apr 02, 2020 , 21:44:51

క‌రోనాపై పోరులో క్రీడాకారులు

క‌రోనాపై పోరులో క్రీడాకారులు

క‌రోనాపై పోరులో క్రీడాకారులు 

న్యూఢిల్లీ: ప‌్రమాద‌క‌ర క‌రోనా వైర‌స్ పై పోరాడేందుకు క్రీడాకారులు విరాళాల రూపంలో ముందుకొస్తూనే ఉన్నారు. ఇప్ప‌టికే ప‌లువురు తమ స్థాయికి త‌గిన రీతిలో స‌హాయం చేయ‌గా, మ‌రికొంద‌రు కూడా ముందుకొచ్చారు. టీమ్ఇండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీ‌ధ‌ర్‌..తెలంగాణ ముఖ్య‌మంత్రి స‌హాయ‌క నిధికి రూ.ల‌క్షా 50 వేల విరాళ‌మిచ్చాడు. దీనికి తోడు పీఎం-కేర్స్ కు రూ.2 ల‌క్ష‌లు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు రూ.50 వేలు ఇస్తున్న‌ట్లు శ్రీ‌ధ‌ర్.. గురువారం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే భార‌త యువ షూట‌ర్లు అపూర్వి చండేలా(రూ.3 ల‌క్ష‌లు), మ‌ను భాక‌ర్‌(రూ. ల‌క్ష‌) విరాళ‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మ‌రోవైపు టీమ్ఇండియా మాజీ క్రికెట‌ర్‌, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ త‌న రెండేండ్ల జీతాన్ని పీఎం కేర్స్‌కు స‌హాయం చేసిన సంగ‌తి తెలిసిందే. 


logo