గురువారం 13 ఆగస్టు 2020
Sports - Jul 05, 2020 , 02:44:54

కోచ్‌ల వేతన పరిమితి ఎత్తివేత

 కోచ్‌ల వేతన   పరిమితి ఎత్తివేత

న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో పతకాలే లక్ష్యం గా ముందుకెళుతున్న కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎలై ట్‌ అథ్లెట్లకు శిక్షణనిస్తున్న భారత కోచ్‌లకు గరిష్ఠంగా రూ.2 లక్షలే ఇవ్వాలన్న నిబంధనను ఎత్తేస్తున్నట్టు కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు శనివారం తెలిపారు. అద్భుతంగా పనిచేస్తున్న కోచ్‌లను మరింత ప్రోత్సహించడంతో పాటు మాజీ స్టార్‌ ప్లేయర్లను కోచింగ్‌ వైపునకు ఆకర్షించేందుకు ఈ నిర్ణ యం తీసుకున్నామని తెలిపారు. క్రీడా శాఖ నిర్ణయాన్ని ఐవోసీ, జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ స్వాగతించారు.


logo