శుక్రవారం 07 ఆగస్టు 2020
Sports - Jul 04, 2020 , 02:59:37

‘టాప్స్‌'లోకి జూనియర్‌ అథ్లెట్లు

‘టాప్స్‌'లోకి జూనియర్‌ అథ్లెట్లు

కేంద్ర మంత్రి రిజిజు 

న్యూఢిల్లీ: ప్రతిభ కలిగిన యువ అథ్లెట్లకు చేయూతనిచ్చేందుకు ఇప్పటికే ‘టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం స్కీమ్‌'(టాప్స్‌) పతకాన్ని అమలు చేస్తుండగా.. తాజాగా జూనియర్‌ అథ్లెట్లకు కూడా దీన్ని త్వరలో ప్రారంభిస్తామని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. 2028 ఒలింపిక్స్‌లో భారత్‌ను టాప్‌-10లో నిలుపడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నామని ఆయన అన్నారు. శుక్రవారం ‘ఫిట్‌ హై తో హిట్‌ హై.. ఫిట్‌ ఇండియా’  వెబినార్‌లో రిజిజు ప్రసంగిం చారు. ‘త్వరలో టాప్స్‌లోకి ప్రతిభ కలిగిన 10-12 ఏండ్ల మధ్య  పిల్లలను తీసుకుంటాం. వారికి అ త్యుత్తమ శిక్షణ ఇస్తాం. ఫిట్‌ ఇండియా ఉద్యమంలో ప్రజలను భాగం చేస్తూ ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించడం కోసం ప్రయత్నాలు కొనసాగిస్తాం’ అని రిజిజు అన్నారు. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్‌ పొఖ్రియాల్‌, స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు, భారత ఫుట్‌బాల్‌ కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రీ కూడా వెబినార్‌లో పాల్గొన్నారు. 


logo